బీజేపీ తదుపరి టార్గెల్ అదే
ఆర్టికల్ 370ని రద్దు చేస్తు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దేశ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తు కేంద్ర చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నేటి నుంచి కశ్మీర్లో త్రివర్ణ పతకాన్ని ఎగురవేస్తామని అన్నారు. ఇష్టం లేకపోయినా 370 ఆర్టికల్ రద్దును అందరూ ఖచ్చితంగా అంగీకరించాల్సిందేనని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీజేపీ తర్వాతి టార్గెట్ అయోధ్యలో రామమందిర నిర్మాణమేనని పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికలకంటే ముందే రామాలయాన్ని నిర్మించి తీరుతామన్నారు. కాశీలో శివాలయం, మధురలో శ్రీకృష్ణుడి గుడిని నిర్మిస్తామన్నారు. బీజేపీ హిందువుల పార్టీ అని, హిందూ ధర్మాన్ని కాపాడటమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ తీరు వలనే భారతదేశానికి కశ్మీర్ సమస్య ఉత్పన్నమైందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.













