ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంటే… ఇలాంటి వాహనమా?
ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ఇచ్చిన బుల్లెట్ ఫ్రూప్ వాహనంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు బుల్లెట్ ఫ్రూప్ వాహనం ఇచ్చారు. 4 నెలల క్రితం రోడ్డు మధ్యలో ఆ వాహనం ఆగిపోతే ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించాను. మరమ్మతులు చేసి అదే వాహానాన్ని మళ్లీ ఇచ్చారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ ఆగిపోయింది. గన్మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లాను. అఫ్జల్గంజ్ వద్ద మరోసారి ఆగిపోయింది. అప్పుడు సొంత వాహనం రప్పించుకుని వెళ్లాను. ఉగ్రవాదుల నుంచి దాడులు ముప్పు పొంచి ఉన్న నాకు ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం చిఆ్చరు అని అసహనం వ్యక్తం చేశారు.













