కాంగ్రెస్ ను రైతులు నమ్మరు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య పోరు కేంద్రం నుంచి రాష్ట్రం గల్లీల వరకు ఉంది. ఒకప్పుడు భారతదేశంలో తన మాట చలాయించిన కాంగ్రెస్ క్రమంగా డీలా పడిపోయింది. ఇప్పుడు తిరిగి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం కాంగ్రెస్ నేతలు కుస్తీలు పడుతున్నారు. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ విజయం దీనికి ఆరంభం అని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలలో తమ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుచుకుంటే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. నిర్మల్ రైతు సత్యాగ్రహ దీక్షలో శుక్రవారం నాడు పాల్గొన్న ఆయన కాంగ్రెస్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తెలంగాణలో ఈ సారి 10 నుంచి 12 స్థానాల వరకు గెలుచుకుంటాము అన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను గుడ్డిగా నమ్మినందుకు రైతులను మోసం చేశారని.. అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని.. ఆయన పేర్కొనారు. ఎండల కారణంగా పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు కనీసం నష్టపరిహారం ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక తెలంగాణ వాసులు నమ్మరని అన్నారు. రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న ప్రేమ రైతులపై లేదు అంటూ వ్యాఖ్యానించారు.