టీఆర్ఎస్ కు ఒక్క క్షణం.. అధికారంలో ఉండే అర్హత లేదు : రమణ్‌సింగ్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు అర్హత లేదని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అన్నారు. కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను కలిసి ఎంపీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని అన్నారు. పోలీసులు ఎంపీ కార్యాలయంపై దాడి చేసి తాళాలు పగులగొట్టి లోపల ఉన్న బండి సంజయ్ సహా కార్యకర్తలను విక్షచణ రహితంగా లాఠీచార్జీ చేయడమే కాకుండా దొంగల్లా సీసీ పుటేజీలను ఎత్తుకెళ్లారన్నారు. కార్యకర్తలు, మహిళలు అని చూడకుండా లాఠీచార్జ్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద రాజకీయ దుర్ఘటన చూడలేదని మండిపడ్డారు.













