ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మరిచిపోయారా?
బీఆర్ఎస్ బలమేంటో అర్థమైనందునే ఖమ్మంలో సభ పెట్టుకోవాలని నిర్ణయించారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం సభలో రైతులకు దిక్చూచి చూపిస్తానన్న సీఎం కేసీఆర్, అదే రైతులకు సంకెళ్లు వేసిన విషయాన్ని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో ఫిరాయింపులకు బీఆర్ఎస్ పెట్టింది పేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నపుడు సోనియా, రాహుల్ గాధీ స్పందించలేదు. అందుకే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్పై ఎదురుదాడి చేయలేదు. కేసీఆర్‌ను కాపాడే పనిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భుజాలకు ఎత్తుకుంది. కేసీఆర్ కమ్యూనిస్టులు వంత పాడుతున్నారు. కమ్యూనిస్టుల కోరిక మేరకే ఖమ్మంలో బీఆర్ఎస్ సభ పెడుతున్నారు. మంత్రి హరీశ్‌రావును ఢల్లీికి పంపించేందుకే జాతీయ పార్టీగగా మార్చారు. సీఎస్ సోమేశ్‌కుమార్‌ను రాజ్యాంగబద్ధంగా ఏపీకి కేటాయించారు. కేసీఆర్ ఆయన పట్ల మక్కువతో తెలంగాణలో ఉండేలా చేశారు. పదవీ విరణమ పొందిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు సలహాదారులుగా సీఎం నియమించుకుంటున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వారి సేవలను వినియోగించుకుంటున్నారు అని ఆరోపించారు.













