రాజన్న రాజ్యమంటే దోచుకోవడం… దాచుకోవడమే
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ వైఎస్ షర్మిల ఖమ్మం సభలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాజన్న రాజ్యమంటే దోచుకోవడం, దాచుకోవడమేనని బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది రాజన్న రాజ్యమేనని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజన్న రాజ్యంలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. షర్మిల ప్రసంగం సీఎం కేసీఆర్ రాసి ఇచ్చిందేనని తీవ్రమైన విమర్శలు చేశారు. లక్ష మందితో టీఆర్ఎస్ సభ నిర్వహిస్తామంటుంటే అనుమతి ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్లో విచ్చలవిడిగా మద్యం పంచుతున్నారని ఆరోపించారు.













