ప్రకాష్‌రాజ్‌తో కలిసి కేసీఆర్ ప్రయాణం… అసలు ఉద్దేశం ఏంటి?
సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రయాణం వెనక ఉద్దేశం ఏంటని బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతపై దృష్టి మళ్లీంచేందుకే కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను ఓడిరచటమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ విచ్చిన్నకర శక్తులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రయాణం చేయడం ప్రమాదకరమైన అంశమని మండిపడ్డారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలకు ముళ్లు గుచ్చుకున్నా సీఎం కేసీఆర్ స్పందిస్తున్నారన్నారు. వాళ్లతో కలిసి వెళితే ఏకాకి కావాల్సి వస్తోందని హెచ్చరించారు. గతంలోనూ ఫెడరల్ ఫ్రంట్ అంటే ఏం జరిగిందో అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. దేశ సైనిక శక్తిని గతంలో అనుమానించిన వ్యక్తి ప్రకాష్ రాజ్ అని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలో ప్రశ్నించి, అనుమానించి, అవమానించిన వ్యక్తి ప్రకాష్ రాజ్ అని అన్నారు. కేసీఆర్ కూడా సర్జికల్ స్ట్రైక్‌ను ప్రశ్నించారని, దాన్ని ప్రశ్నించడం అంటే సైనిక శక్తిని ప్రశ్నించడమే అని ఆయన తెలిపారు.













