ఇది భారతీయ ముస్లిం మహిళల విజయం
ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడం సంతోషంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది భారతీయ ముస్లిం మహిళల విజయమన్నారు. కుటుంబ అవినీతి పాలనపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు విస్తారక్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో 7వేలకు పైగా సభ్యులు పాల్గొంటారన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రానున్న రోజుల్లో టీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ పోటీ చేయబోతోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసినా తమ గెలుపును ఆపలేరన్నారు. రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినం జరపడం లేదంటే అది ఎంఐఎం ఎజెండానే అని అన్నారు.













