దీక్ష విరమించిన లక్ష్మణ్..
హైదరాబాద్ నిమ్స్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం అహిర్ దీక్ష విరమింపజేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ లక్ష్మణ్ ఐదు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం క్షీణిస్తున్నందున పార్టీ కోర్ కమిటీ సూచన మేరకు లక్ష్మణ్ దీక్ష విరమించారు. లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా దీక్ష విరమించాలని కోరినట్లు హన్స్‌రాజ్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులు ఇంత పెద్దఎత్తున ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం తరపున విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి, ఇంటర్ బోర్డు కార్యదర్శిని వెంటనే తొలగించాలని, దీనిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు. హన్స్‌రాజ్‌తో పాటు బీజేపీ నేతలు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, రామచంద్రరావు పాల్గొన్నారు.













