బీజేపీ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు : లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయడమే తమ లక్ష్యమని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగడం లేదని, బీజేపీ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తుపై ఆలోచన లేదని అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమించడమే కేంద్రమంత్రి పదవిగా భావిస్తున్నట్లు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తర్వాత పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన రెండో వ్యక్తిని తానేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.













