ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఐదు విడతలుగా పాదయాత్ర నిర్వహించారు. ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అధిష్టానం పచ్చజెండా ఊపింది. ఏయే రూట్లలో పాదయాత్ర కొనసాగించాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. రూట్ మ్యాప్ తయారు చేశాక పూర్తి వివరాలు వెల్లడించనున్నారు బీజేపీ నేతలు. కొడంగల్ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తోంది. ఆరో విడత పాదయాత్రను 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.













