బీజేపీ ఎంపీ అభ్యర్థి కు వై ప్లస్ భద్రత..

తెలంగాణలో ఎన్నికల హడావిడి నేపథ్యంలో కేంద్రం ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఓ వ్యక్తికి వై ప్లస్ భద్రత కల్పించనుంది. అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి వీఐపీ సెక్యూరిటీ లో భాగంగా 11 మందికి పైగా సీఆర్పీఎఫ్(CRPF) భద్రతా సిబ్బందిని కేటాయిస్తారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. మాధవీలత. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ ఎంపీ స్థానం ఎంఐఎం కంచుకోట.. కాబట్టి అక్కడ నుంచి పోటీ చేయడం అంత సులువైన విషయం కాదు. దశాబ్దాలు గా అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈసారి ఎలాగైనా హైదరాబాద్ ఎంపీ స్థానంలో కాషాయి జెండా ఎగురవేయాలి అని బీజేపీ పెద్దలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే హిందూ ధర్మం పట్ల నిర్వహించే మాధవీలత ను ఆస్థానానికి ఎంపీ అభ్యర్థిగా ఎంచుకున్నారు. అయితే ఈ స్థానంలో ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో ఆమెకు వై ప్లస్ భద్రత ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించుకుంది. సుమారు 6 మంది సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎప్పుడూ ఆమె వెంట ఉంటారు.. మరొక ఐదుగురు భద్రతా సిబ్బంది ఆమె ఇంటి వద్ద సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహిస్తారు.