కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే.. రాష్ట్రంలో
సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీని గెలిపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్న బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఓటు వేసేముందు కరీంనగర్ ప్రజలు, యువత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు.













