హైకోర్టు సంచలన తీర్పు
శాసనమండలిలో భూపతిరెడ్డిపై అనర్హత వేటు కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భూపతి రెడ్డి ఫిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. అనర్హత రాజ్యాంగ బద్ధంగా ఉందని కోర్టు తెల్చి చెప్పింది. శాసననమండలి చైర్మన్ భూపతిరెడ్డిపై తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో రాజ్యాంగ బద్దంగానే జరిగిందని, దానిపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం సృష్టం చేసింది. గత ఎన్నికల ముందు గవర్నర్ కోటాలో ఎన్నికైన రాములు నాయక్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవ్ రెడ్డి, అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి ఎన్నికైన భూపతి రెడ్డి.. ఈ ముగ్గురు పార్టీ వీడి కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో ఈ ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. గత వారం రాములు నాయక్, యాదవ్ రెడ్డిల ఫిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఆ ఫిటిషన్లను కొట్టివేసింది. ఇవాళ భూపతి రెడ్డి ఫిటిషన్ను విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.













