ఈ నెల 25 నుంచి బయో ఏషియా సదస్సు
అంతర్జాతీయ లైఫ్ సైన్సెస్ సమ్మిట్ బయో ఏషియా 2019ను ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ సదస్సును ప్రారంభిస్తారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ రంగానికి మరింత ఊతమిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం బయో ఏషియా సదస్సును నిర్వహిస్తూ వస్తోందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. 16 ఎడిషన్ బయో ఏషియా 2019ను లైఫ్‌సైన్సెస్ 4.0-50కి పైగా దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారని వెల్లడించారు. అలాగే ప్రభుత్వం, పరిశ్రమ, ఇన్వెస్టర్లు, అకాడమీ విభాగాలకు చెందిన వందకు పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు.













