ఆ విషయంలో ప్రధాని మోదీ… జోక్యం చేసుకోవాలి
గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేపు కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించాలంటూ మీరు చెప్ప మాటలపై చిత్తశుద్ధి ఉంటే, గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఆర్డర్‌పై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కేటీఆర్ కోరారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయించి దేశం పట్ల మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలకు వ్యతిరేకంగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అసహ్యంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (జీపీఎస్)లో తగిన సవరణలు చేసి రెప్టిస్టులకు బెయిల్ రాకుండా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.













