ఈ నెల 11 నుంచి భీమా పుష్కరాలు
భీమా పుష్కరాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. కృష్ణా నదికి ఉప నది అయిన భీమా పుష్కరాలను భక్తులు మహాపుష్కరాలుగా భావిస్తారు. ఇవి 144 ఏళ్లకోసారి వస్తాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించే ఈ పుష్కర స్నానాలకు లక్షలాది మంది తరలివస్తారు. ఈ నెల 11 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే పుష్కర ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తెలిపారు. ఆయన భీమా పుష్కరాల గోడ పత్రికను ఆవిష్కరించారు. తంగడిగి, సూకూర్ లింగంపల్లి, కుసునూరు గ్రామాల గుండా 10 కిలోమీటర్ల మేర భీమా నది ప్రవహిస్తుందని, ఈ గ్రామాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.













