బడ్జెట్ అంచనాల కోసమే… ప్రజాపాలన ద్వారా : భట్టి విక్రమార్క
మధిర నియోజకవర్గంలో ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తానని హామీ ఇచ్చాం. రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచాం. పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బడ్జెట్ అంచనాల కోసమే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం అని తెలిపారు.













