విజయవంతంగా ముగిసిన భారత్ బంద్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు బంద్‌లో పాల్గొన్నారు. భారత్ బంద్‌లో 25 రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. రోడ్లను దిగ్బంధించి.. అన్ని రకాల వాహనాలను నిలిపివేశారు. దుకాణాలను మూసివేశారు. ఇప్పుడు బంద్ ముగియడంతో బస్సులు ప్రారంభ కానున్నాయి. హైదరాబాద్ ఎంజిబిఎస్ నుంచి ఇప్పటికే బస్సులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. దుకణాలు తెరుచుకున్నాయి. భారత్ బంద్‌లో భాగంగా రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవంతంగా బంద్ కొనసాగింది. తెలంగాణ రోడ్లమీద కాంగ్రెస్, టీఆర్ఎస్ నిరసన తెలిపాయి. మోదీ ప్రభుత్వానికి రైతు వ్యతిరేక విధానాలంటూ నేతలు నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేదాకా పోరాడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.













