ఆరు గ్రామాలను మళ్లీ భద్రాద్రిలో కలపండి
భద్రాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు. భద్రాచలంలో ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాద్రిని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పువ్వాడ కోరారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. కుట్ర పూరితంగా 7 మండలాలను ఏపీలో కలిపారని ఆరోపించారు. ఆలయానికి చెందిన 1,800 ఎకరాల భూమిని ఏపీలో కలిపారని విమర్శించారు. కనీసం ఆరు గ్రామాలను మళ్లీ భద్రాచలంలో కలపాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. దీని కోసం కేంద్రం చొరవ తీసుకోవాలన్నారు. యాదాద్రి తర్వాత భద్రాద్రిపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామని, రూ.100 కోట్లతో భద్రాద్రి అభివృద్ధి చేసే ఆలోచనలో సీఎం ఉన్నారని వెల్లడించారు. అనంతరం జీసీసీలో సబ్బులు, షాంపూ తయారీ యూనిట్‌ను మంత్రులు పువ్వాడ, సత్యవతి, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.













