కాంగ్రెస్‌లో నాయకత్వానికి కొదవలేదు :మల్లు
త్వరలోనే తెలంగాణ ఎన్నారైలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమవుతారని టీపీసీసీ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తన అమెరికా పర్యటన విశేషాలను వివరిస్తూ, తెలంగాణ ప్రగతి శీలంగా, ప్రజాస్వామ్య హితంగా ఉండాలని ఎన్నారైలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నారైలు తెలగాణ సంపద అని, వారి మేధస్సు రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. నయీం కేసులో వాస్తవాలు ఎందుకు బయటపెట్టడం లేదని అడిగారని, రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై ఆశ్చర్యపోయారని తెలిపారు. మియాపూర్ భూకుంభకోణంలో వాస్తవాలు తెలుసుకునేందుకు వారి ఆసక్తి కనబరిచారన్నారు. త్వరలో పార్టీ అనుబంధ సంఘాల పనితీరును సమీక్షిస్తామన్నారు. కోమటి రెడ్డి పాదయాత్ర ఆయన వ్యక్తిగతమని పార్టీలో చర్చిస్తామన్నారు.













