ఆ ప్రభావమే ప్రస్తుత ఎన్నికలపై : భట్టి
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ .. ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పంజాబ్లో కాంగ్రెస్ పాలన కొనసాగిందన్నారు. అక్కడ కాంగ్రెస్ నేతల తీరు రోగం ముదిరాక మందు వేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని, ఆ ప్రభావమే ప్రస్తుత ఎన్నికలపై పడిరదన్నారు. అయితే పంజాబ్ ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించవని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి గొడవలు లేవని, కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు.













