ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే : భట్టి విక్రమార్క
పీపుల్స్ మార్చ్ ఎన్నికల కోసం కాదని, ప్రజల కోసమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. అడిగితే అసెంబ్లీ బంద్ చేస్తారని, ప్రశ్నిస్తే కేసులు పెడతారని మండిపడ్డారు. పండిరచిన పంటకు మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. రేట్లు పెంచడంలో మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లెక్కలు అడిగితే కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













