కేసీఆర్, కేటీఆర్ వచ్చి ఎన్ని ప్రగల్భాలు పలికినా.. తాను 50వేల మెజార్టీతో
100 మంది కేసీఆర్లు వచ్చినా తనను ఓడించలేరని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. మధిరిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భట్టి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ వచ్చి ఎన్ని ప్రగల్భాలు పలికినా తాను 50వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మధిర పోరాటాల పురిటిగడ్డ అని పేర్కొన్నారు. సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది అని అన్నారు. ఫ్యూడల్ ప్రభుత్వమైన బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలపాలని, ప్రజల సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంపద అందరికీ సమానంగా అందుతుందని భావిస్తే, బీఆర్ఎస్ నేతలు మాత్రమే దాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద వాడికి ఇళ్లు, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, ప్రతి రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ నుంచి మధిర వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని మేనిఫెస్టో రూపొందించామని అనారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించిందన్నారు.













