దుబాయ్‌లో బతుకమ్మ సంబురాలు
దుబాయ్‌లో అక్టోబర్ 2న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్, టీఏ, తెలంగాణ జాగృతి (యూఏఈ) సంయుక్తంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబురాల్లో పాల్గొనాలని కోరుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. యూఏఈటీసీఏ అధ్యక్షుడు రాధారపు సత్యం హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కవిత బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఫుడ్స్ కమిషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్, మడుపు తిరుపతిరెడ్డి, లోకుర్తి తిరుపతి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.













