లోక్ సభ బరిలోనూ బర్రెలక్క!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావుపై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం సృష్టించిన బర్రెలక్క అలియాస్ శిరీష లోక్సభ ఎన్నికల్లోనూ పోటీకి సై అంటున్నారు. నాగర్ కర్నూలు లోక్సభ నుంచి పోటీ చేస్తానని బర్రెలక్క ప్రకటించారు. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ చదువుకున్నా బర్రెలు కాసుకుంటున్నా అంటూ ఆమే చేసిన వీడియో అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఆ తరుఆవత ఆమె పేరు కాస్త బర్రెలక్కగా మారిపోయింది. పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన బర్రెలక్క ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని భావించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అక్కడ విజయం సాధించారు. అయితే బర్రెలక్కకు ఆరు వేల ఓట్లు దక్కాయి. ఓటమి విషయంలో కాస్త నిరాశపాలైనా తన పట్టుదల మాత్రం వీడలేదు బర్రెలక్క. ఇప్పుడు లోక్షభ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించారు. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేస్తానని బర్రెలక్క ప్రకటించారు.













