ఎమ్మెల్యే రాజాసింగ్ పై నిషేధం విధించిన ఫేస్బుక్
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాపై ఫేస్బుక్ నిషేధం విధించింది. ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వ్యక్తిగత ఖాతాలను తొలగించారు. ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో రాజాసింగ్ ఫేస్బుక్ నియమాలను పాటించలేదని ఫేస్బుక్ యాజమాన్యం తెలిపింది. హింసను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తమ నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారు అని ఫేస్బుక్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖాతాపై నిషేధం విధించామని సృష్టం చేశారు.













