అసెంబ్లీలో ఆ సమస్యను ప్రస్తావించడం అభినందనీయం
త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలను అనుగుణంగా పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రాస్తావించడం అభినందనీయమని తెలిపారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ.5.04 లక్షల చెల్లించాలని విన్నవించారు. నీలోజిపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌తో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోశ్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ను కోరారు.













