ఇచ్చిన మాట తప్పి సీఎం కేసీఆర్ : బండి సంజయ్
రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్, ఇచ్చిన మాట తప్పి శివయ్యనే మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహాశివరాత్రి సందర్భంగా బండి సంజయ్ వేములవాడ రాజన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మూర్ఖపు పాలన అంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. వేములవాడ వచ్చిన లక్షలాది మంది భక్తులు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. మంచి నీళ్లు కూడా లేక పసిపిల్లలు ఏడుస్తున్నారు. శివ దీక్ష తీసుకున్న భక్తులకు కూడా సౌకర్యాలు లేవు. రాజన్న ఆలయం అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదు అని అన్నారు. వేములవాడకు నయాపైసా ఇవ్వకుండా ఇక్కడి పైసలు తీసుకుపోయి బయట ఖర్చు చేయడం దారుణం. కావాలనే వేములవాడతో పాటు కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ది కోసం కూడా ప్రతిపాదనలు పంపాలని అడిగినా పట్టించుకోలేదన్నారు. శివుడు అన్నీ గమనిస్తున్నాడు. పేదల కోసం రాజన్న ఆలయ అభివృద్ధి కోసం సీఎం రూ.10 కోట్లు కూడా ఖర్చు చేయడం లేదు. ఢల్లీి లిక్కర్ స్వామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎంకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. నీ బిడ్డకు కూడా ఏం జరగాలో అదే జరుగుతుంది అని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు.













