బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అధికారంలోకి రాగానే
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాయలం డోమ్‌లు కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. కొత్త సచివాయంలో మార్పులు చేస్తాము. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తాము. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామన్నారు. ప్రగతిభవన్‌ను కూడా ప్రజా దర్బార్‌గా మారుస్తామని కామెంట్స్ చేశారు. రోడ్లకు అడ్డంగా ఉన్న గుళ్లు, మసీదులు కూల్చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు. దమ్ముంటే పాతబస్తీ నుంచే ఇది మొదలుపెట్టాలి. కేసీఆర్ తెలంగాణను ఎంఐఎంకి కట్టబెట్టాలని చూస్తున్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీచేస్తే డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామన్నారు. తెలంగాణలో నిజాం రాజ్యాం పోవాలి, మన రాజ్యం రావాలన్నారు. పాతబస్తీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు, పాస్‌పోర్టులు ఎందుకు రావడం లేదో ఎంఐఎం నేతలు, పాతబస్తీలు ఆలోచించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటనా జరిగినా పాతబస్తికి చెందిన వ్యక్తులే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.













