ఆ పార్టీలు అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మళ్లీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు తథ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విజయ శంఖారావం కార్యక్రమాన్ని బండి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీగా మండలంలోని పత్లాపూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం బిచ్కుంద బస్లాండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇస్తారా? అని ప్రశ్నించారు.













