బూత్ కమిటీల ద్వారానే బీజేపీ అధికారంలోకి : బండి సంజయ్
పోలింగ్ బూత్ కమిటీల ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీల సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరల్ యాప్ ను ఆయన ప్రారంభించారు. సరల్ యాప్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులను పొందుపరుస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళంతో బీజేపీ బలమెంతో అర్థమైందని అన్నారు. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పని చేశారు. బీజేపీకి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలే మూల స్తంభం. స్మార్ట్ సిటీ, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ, హరితహారం కింద కేంద్ర ఇచ్చిన నిదులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిసోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టం చేయాలి. రుణామాఫీ చేయకపోవడంతో రైతు బంధు డబ్బులను బ్యాంకులు బకాయిలు కింద జమ చేసుకుంటున్నాయి. రాజకీయాల గురించి కాదు అభివృద్ధి గురించి మాట్లాడండి అని అన్నారు.













