ఆగస్టు 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర
ఈ నెల 24వ తేదీ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా పేరు పెట్టారు. ఈ నెల 24న ఉదయం యాత్ర ప్రారంభిస్తారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం వరకు యాత్రను కొనసాగిస్తారు. భాగ్యలక్ష్మీ ఆలయంలో బీజేపీ నేతలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ పూజల తర్వాత ప్రజా సంగ్రామ యాత్ర పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర సాగుతుందని అన్నారు. ఈ పాదయాత్రలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. తెలంగాణను అడ్డుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్‌ను పెట్టారని విమర్శించారు.













