సారీ ఈ తేదీన రాలేను : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కి బీజేపీ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న ఆయన ఇవాళ లేఖ ద్వారా స్పందించారు. మెయిల్ ద్వారా తనకు నోటీసులు అందాయని తెలిపిన సంజయ్, పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో 15వ తేదీ కమిషన్ ఎదుట హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. అయితే బదులుగా ఈ నెల 18వ తేదీని కమిషన్ చైర్మన్ సూచించిన టైంకి హాజరుకాగలని చెప్పారు. అలాగే తాను కమిషన్ ఎదుట హాజరయ్యే అంశంపై పూర్తి సమాచారం అందించగలిగితే, తాను విచారణ సమయానికి పూర్తి స్థాయి సన్నద్ధతో ఉంటానని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.













