కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో జైలు అధికారలు ఆయన్ను విడుదల చేశారు. సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. జైలు బయట వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మరోవైపు సంజయ్ విడుదల నేపథ్యంలో కరీంనగర్ జైలు వద్దకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.













