కవితకు బెయిల్.. కాంగ్రెస్‌కు కంగ్రాట్స్ చెప్పిన బండి సంజయ్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడంపై బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు బెయిల్ దక్కినందుకు కాంగ్రెస్ పార్టీకి, వారి లాయర్లకు సంజయ్ అభినందనలు తెలిపారు. హస్తం పార్టీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించి, కవితకు బెయిల్ దక్కిందని చురకలంటించారు. ఈ బెయిల్ కచ్చితంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల విజయమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకురాలు బెయిల్‌పై బయటకు రావడంతోనే, కాంగ్రెస్ నేత రాజ్యసభకు వెళ్తున్నారని చెప్పారు. కవితకు బెయిల్ కోసం కోర్టులో వాదనలు వినిపించిన కాంగ్రెస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా రాజ్యసభకు నామినేట్ చేయడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.