కవితకు ఈడీ నోటీసులకు.. తెలంగాణ సమాజానికి ఏం సంబంధం ?
తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌ను పట్టించుకునే పరిస్థితిలో లేరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళల దినోత్సవ వేడుకల్లో సంజయ్ పాల్గొని మాటాట్లాడారు. మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత బీఆర్ఎస్కు లేదని అన్నారు. బీఆర్ఎస్లో మహిళా విభాగమే లేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్సీ ఇచ్చారా? అని ప్రశ్నింంచారు. తొలి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులకు, తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? విచారణకు పిలిస్తే వెళ్లి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. కోర్టులు కొడతాయా అని గతంలో కేసీఆర్ అన్నారు. దర్యాప్తు సంస్థలకు, బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఈ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. కవిత వల్ల మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్, కేటీఆర్‌లు కవిత విషయంపై ఎందుకు స్పందించలేదు అని అన్నారు.













