రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారనే విషయం అర్థమవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎంను ఆదరాబాదరాగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. జీ`20 సమావేశాల సమయంలోనే అరెస్టు చేయడానికి పోలీసులకు సమయం కుదిరిందా అని ప్రశ్నించారు. తాజా అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబుకు మైలేజ్ వచ్చిందని తెలిపారు. తప్పును తప్పు అని చెబితే చంద్రబాబు ఏజెంట్ అని ముద్ర వేసే దురలవాటు వైసీపీ నేతలకు ఉందని విమర్శించారు.













