తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బైంసా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మిగులు నిధులతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కోసం బీజేపీ ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉందన్నారు. అక్కడి కాంట్రాక్టర్ కేసీఆర్ చుట్టం కాబట్టే విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారు. నిర్మల్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ మళ్లీ సీఎం అయితే మరో రూ.5 లక్షల కోట్లు అప్పు చేస్తారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీకి ఒక్కసారి అకాశమివ్వండి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముథోల్ నియోజకవర్గంలో పాటు, రాష్ట్రంలో నిలువనీడలేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. బైంసాలో హిందూ సమాజం భయపడాల్సిన అవసరం లేదు, బీజేపీ వారికి అండగా ఉంటుంది అని సంజయ్ తెలిపారు.













