బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే : బండి
బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో బండి మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్న జనగర్జన సభకు విపరీతమైన స్పందన వచ్చిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, బీజేపీ గ్రాఫ్ తగ్గినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలా ప్రజలు భావించడం వల్లే దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మమ్మల్ని ప్రజలు ఆదరించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు. నిధులు కేంద్రానివి సోకులు రాష్ట్రానివి అని అన్నారు.
ధాన్యం కొనేది కేంద్రం. ప్రతి గింజా మేము కొంటున్నామని రాష్ట్రం అబద్దాలు చెబుతోంది. ఉపాధి హామీ డబ్బులు కూడా మావేనని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. రైతుల పంట నష్టపోతే పరిహారం ఎందుకు ఇవ్వలేదు? అభివృద్ధి చేస్తున్నది చేసేది బీజేపీనే. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ అవినీతి, అరాచకాలు, కబ్జాలు చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ.5 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అవుతుంది. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుంది? కరీంనగర్లో పోటీ చేయాలని ఉందని నా కోరిక చెప్పా. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తా అని వెల్లడిరచారు.













