కేసీఆర్ ఒక్కసారి వెళ్తే.. కిషన్‍రెడ్డి ఏడు సార్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి ఒక్కసారి వెళ్తే కేంద్ర సహాయమంత్రి కిషన్‍రెడ్డి ఏడు సార్లు వెళ్లి వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సాధించారని నిలదీశారు. వరంల్ ఎంజీఎంకు ఈరోజే ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఓ దొంగల ముఠా అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వ్యాక్సిన్ ఆపేశారు? అని ప్రశ్నించారు.