సీఎం కేసీఆర్ ఏడేళ్లలో.. ఒక్కసారి కూడా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్లలో ఒక్కసారి కూడా అంబేడ్కర్‌కు నివాళులు అర్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ స్ఫూర్తిని బీజేపీ ముందుకు తీసుకెళ్తుందోని అన్నారు. దళిత వ్యక్తిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీది అని అన్నారు. 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసిన గొప్పతనం బీజేపీకే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించిందని ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు.













