మా పేరు చెప్పి…ఆ పని చేస్తే ఊరుకోం : బండి
ఎన్నికలు వస్తేనే మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయి. మా పేరు చెప్పి మీటర్లు పెడితే ఊరుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు, కుమార్తె పై వస్తోన్న అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని విమర్శించారు. దీంతో సీఎం బాగా డిప్రెషన్లోకి వెళ్లారంటూ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రజలు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని నలుగురు మహిళలు చనిపోయారు. దేశంలో ఎక్కడా జరగని సంఘటన ఇది అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వాళ్లని ఆదుకోలేదు. గంట లోపల 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం ఏంటి? అక్కడ కనీసం మహిళ డాక్టరేట్‌ను పెట్టలేదు. ఈ దుర్ఘటనకు ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యత వహించాలి. వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలి. హెల్త్ డైరెక్టర్ పైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెల ఆయన డబ్బులు మూటలు పంపిస్తారు కాబట్టి కేసీఆర్ చర్యలు తీసుకోట్లేదు. రేపు డీహెచ్‌ను ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని చేస్తారు అని ఆరోపించారు.













