అధైర్యపడొద్దు.. మీకు అండగా బీజేపీ
సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడొద్దు, అధైర్యపడొద్దు మీకు అండగా బీజేపీ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు సర్పంచ్లకు ఆయన మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. గ్రామాలు స్వశక్తితో అభివృద్థి పథంలో నడాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని అన్నారు. 73, 74 రాజ్యాంగ అధికరణలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. సర్పంచ్ల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలని, పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండిరగ్ బిల్లులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్రంలో గ్రామ సర్పంచ్లు చేసే ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.
బీజేపీ ఆధ్వర్యంలో పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, సర్పంచ్ల హక్కుల పరిరక్షణ కోసం త్వరలో మౌన దీక్ష చేపడతామన్నారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, గ్రామస్వరాజ్యాన్ని సాధిద్దాం, రామరాజ్యాన్ని నిర్మించుకుందా అని పిలుపునిచ్చారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ వ్యవస్థ అనే అంశం కింద ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చిందన్నారు.













