బీజేపీ పాదయాత్రకు బ్రేక్ ?
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం ఉంది. పాదయాత్రలో ఆయన అస్వస్థతకు గురైయ్యారు. 12 రోజులుగా ఎండల్లో పాదయాత్ర చేస్తున్నారు. రెండురోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర చేస్తానని ఆయన అంటున్నారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సోడియం, పోటాషియం లెవన్స్ల్లో తేడాను వైద్యులు గుర్తించారు. వైద్యులు, పాదయాత్ర ఇంచార్జులతో బండి సంజయ్ భేటీ కానున్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్స్ బట్టి పాదయాత్రపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.













