సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ టైమ్‌పాస్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అని అన్నారు. ముందు తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనపై, అదే సమయంలో కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. వారసత్వ, అవినీతి పార్టీలు దేశంలో అంతమైపోతున్నాయని అన్నారు. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్చిన్నం చేశారని ఆరోపించారు. ప్రపంచంలో భారత్‌ను మోడీ అగ్రస్థానంలో నిలిపారని తెలిపారు. కానీ కేసీఆర్ మాత్రం ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.













