రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసే
2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే పోటీ చేశాయని, రాబోయే ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసే పోటీచేయనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడాయాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ మార్గదర్శకంలోనే కాంగ్రెస్ పని చేస్తోందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనే ఒకే అభ్యర్థికి మద్దతిస్తున్నారన్నారు. బీజేపీ ఉద్యమాలు చేస్తున్నప్పుడే కాంగ్రెస్ కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్‌ను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 2 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర నేపథ్యంలో అదే రోజు కాంగ్రెస్ సిరిసిల్లలో సభ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు.













