మోదీ మళ్లీ రావాలని ఎన్ఆర్ఐల ఆకాంక్ష : బండి సంజయ్
భారత్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలని ఎన్ఆర్ఐలు ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకొని స్వరాష్ట్రానికి చేరుకున్న ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజయ్ మీడియాతో మాట్లాడుతూ పది రోజుల పాటు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తేనే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు.













