టీఆర్ఎస్ ఓటమి తప్పదు .. త్వరలోనే రెండో విడత : సంజయ్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే రెండో విడత బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. నవంబరు 21వ తేదీ నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలవుతుందన్నారు. ఈసారి యాత్ర 50 రోజుల పాటు, జనవరి 10 వరకూ కొనసాగుతుందన్నారు. ఈ నెల 12న నిరుద్యోగుల మిలియన్ మార్చ్‌ను నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీలుంటే ఏడేళ్లలో 30 వేలు మాత్రమే భర్తీ చేశారు అని ఆరోపించారు.













