తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిందని అన్నారు. రెండో విడత పాదయాత్ర 5 జిల్లాలల్లో 348 కిలోమీటర్లు సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై చాలా మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి కొంత మంది నేతలు పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కసిగా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి పాదయాత్రకు జనాలను రప్పించలేదు. ఎక్కడి వారు అక్కడే పాదయాత్రలో పాల్గొనే ఏర్పాట్లు చేశాం. పాదయాత్రలో భాగంగా వచ్చిన విజ్ఞాపన పత్రాలను ప్రభుత్వానికి పంపించామన్నారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరిస్తామనిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ హామీ ఇచ్చారు. తెలంగాణలో రాహుల్ పర్యటనకు వచ్చి ఏం సాధిస్తారు? టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అని అన్నారు. హుజూరాబాద్, దుబ్బాక ఫలితాలు అందుకు నిదర్శనం. తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.













